సంక్రాంతికి రైతు భరోసా నిధులు జమ: తుమ్మల 1 d ago
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారంతో ముగియనున్నాయి. ఇక, ఈ రోజు రైతు భరోసాపై అసెంబ్లీలో చర్చ జరిగింది. సాగు చేయని భూములకు కూడా గత ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చి నిధులను దుర్వినియోగం చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. సాగు చేసిన భూములకు మాత్రమే ఈ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని తుమ్మల తెలిపారు. సంక్రాంతికి విధివిధానాలు పూర్తి చేసి, నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు.